Peter Life history in telugu - Disciple of Jesus

పేతురు జీవితం 

    అపొస్తలుల జాబితాలో సీమోను పేతురు ప్రథముడు. అతడు అందరికన్న వయస్సులో పెద్దవాడు, దుడుకుతనంగలవాడు. యేసు మొదటిసారి అతన్ని కలిసికొన్నప్పుడు అతనికి కేఫా అని పేరు పెట్టాడు. కేఫా అనగా రాయి అని అర్థం (యోహా 1:42). అతడు జాలరి. విద్యావంతుడుకాదు. అయితే క్రీస్తుతో 3 1/2 సం|| కలిసి జీవించిన ఇతడు పామరుడుకాడని అతని పత్రికలలోని సిద్ధాంతపర అంశాలు నిరూపిస్తున్నాయి. అంత మాత్రమే కాదు పేతురు జీవితంలో కలిగిన గొప్ప మార్పును ఈ పత్రికల ద్వారా తెలిసికోవచ్చును. మొదట అతడు క్రీస్తును కలిసినపుడు బలహీనుడు, తొట్రుపాటు గలవాడు. 


    కాని ఇప్పుడు క్రీస్తులో బలవంతుడు, స్థిరుడు. మొదట తొందరపాటు గలవాడు. ఇప్పుడు సహనశీలి. యేసు అతనితో "నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును” (మత్త 16:18) అని చెప్పినా, ఆ బండ క్రీస్తేనని, ఆయనే సంఘానికి ముఖ్యమైన మూలరాయి అని, తాను కేవలం ప్రతి విశ్వాసిలాగే ఒక రాయి మాత్రమేనని (I పేతు 2:5) తెలిసికొన్నాడు. అపొస్తలుల జాబితాలో తన పేరు మొదట ప్రస్తావించబడినా, పెంతెకొస్తు దినాన సంఘస్థాపనలో ప్రధాన పాత్రధారుడైనా, తన్నుతాను హెచ్చించుకోలేదు. పైగా తగ్గింపును గూర్చే వ్రాసాడు (1 పేతు 5:6,7).


పేతురు ప్రత్యేకతలు

  • అందరికన్నా వయస్సులో పెద్దవాడు.
  • దుడుకుతనం గలవాడు.
  • కేఫా అను పేరు గలవాడు.
  • పేతురు అనే పదం మనకు బైబిల్ లో మొత్తం 8 పుస్తకాలలో, 144 వచనాలలో కనిపిస్తుంది.