Telugu Bible Quotations
ఆధ్యాత్మిక నిరాసక్తత - బైబిల్ సూక్తులు
అధ్యాత్మిక నిరాసక్తత
దైవభక్తిని
బాధ్యతగా చేసి
బాధ్యతను
భారంగా మార్చేసింది
భారం మొండికేస్తుంది
బాధ్యత కష్టమని
లోకం ఇష్టమని
నిరాసక్త భక్తి
నిట్టూర్పులతో
నిష్టూరాలతో
కొట్టుమిట్టాడుతుంది.
ఆధ్యాత్మిక పడవకు
రేవు ఒడ్డునే లంగరు వేసి
సముద్రం వదలి
ఇసుక గుంతలలో
విస్తార వలలతో
కొన్ని చేపలు
కొన్నచేపలు చాలని
రోజు గడనే మేలని
నిట్టూర్పులతో
నిష్టూరాలతో
కొట్టుమిట్టాడుతుంది.
దైవభక్తిని
నిరాసక్త భాధ్యతగా
నిటూర్పుల
జాబితగా
అనవసర భారంగా
చేసేస్తుంది.. మార్చేస్తుంది!
సోమరితనమును సొగసుగా
అసమర్ధతను అమాయకంగా
మానసిక అసంతృప్తిగా
స్వయం సర్దుబాటు
పూట గడిస్తే చాలంటుంది.
యంత్రంగా చేసేస్తూ
యాంత్రికం అవుతుంది.
అధ్యాత్మిక పిసినారులంగా
మూలవాక్యపు పసివారంగా
ప్రభుని దృష్టిలో మరుగుజ్జులంగా
పనికి రాని దుర్జలంగా
సారం లేని ఉప్పుగా
పైకి కనబడని తప్పుగా
మసి పూసి మసక చేసి సర్దేస్తుంది
దైవభక్తిని బాధ్యతగా భారంగా మార్చేస్తుంది.
నీ దైవ భక్తిని
నిండుగా
నిండారుగా ఉండని
స్వేచ్ఛార్పణగా
సంతుష్టి సహితంగా పండని
బలవంతంగాను భారంగాను కాక
అదృష్టముగా అపురూపంగా
ఆద్యాంతం ఆరాధ్యంగా వర్ధిల్లని...
తుఫాను రప్పించి
లంగరు తెంప్పించి
సముద్రపు లోతుల్లోకి
ఆధ్యాత్మిక సత్తువల్లోకి
నీ పడవని సాగని
నీ చిన్ని పడవ నిండుగా
ఆయన ఉండగా
పది మందికి అండగా
ఆయనని మాట్లాడనీ
అదృష్టముగా అపురూపంగా
ఆద్యాంతం ఆరాధ్యాంగా వర్ధిల్లని....