Sadhu Sundar Singh Life Story
సాధు సుందర్ సింగ్
బాల్యం
సాధు సుందర్ సింగ్ గారు 1889 వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేది జన్మించారు. సాధు సుందర్ సింగ్ గారు పంజాబ్ రాష్ర్టంలో లుథియానా జిల్లాలోని రాంపూర్ గ్రామంలో, ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. సాధు సుందర్ సింగ్ గారు తన చిన్నతనం నుండి క్రైస్తవ వ్యతిరేక పరిసరాలలో పెరిగాడు. క్రైస్తవ్యం అంటే పడని కుటుంబంలో జన్మించిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ గారికి 14 ఏళ్ళు ఉన్నప్పుడు తన తల్లి మరణించినది.
మిషనరీ జీవితం
నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని అన్వేషించిన సాధు సుందర్ సింగ్ గారు దేవుని ప్రేమ చేత రక్షించబడి గొప్ప సువార్త సేవ జరిగించారు. ఈయన భారతీయ మిషనరీగా ప్రఖ్యాత పొందారు. రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి ఈయనకు విషం ఇచ్చి చంపడానికి యత్నం చేసాడు. అయితే సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు ఏర్పరచుకొని అతన్ని బ్రతికించి అతని ద్వారా గొప్ప పరిచర్యను జరిగించారు.
సాధు సుందర్ సింగ్ తన 16వ ఏట సిమ్లాలోని పారిస్ చర్చ్ నందు బాప్తిస్మము పొంది సేవలో కొనసాగారు. అతను మిషనరీ సేవ చేస్తుండగా ఎన్నో సార్లు జైలుకు వెళ్ళాడు, ఎన్నో శిక్షలు పొందాడు. ముఖ్యంగా హిమాలయ టిబెట్ ప్రాంతాలలో సేవ చేసేటప్పుడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. దేవుని సువార్తను ధైర్యముగా, ఆపకుండా జరిగించారు సాధు సుందర్ సింగ్ గారు.
ముఖ్యమైన సంవత్సరాలు
- 1889 - పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ లో జన్మించారు.
- 1903 - సిక్కు నుండి క్రైస్తవునిగా మార్పు చెందారు.
- 1904 - కుటుంబం నుండి వెలివేయబడ్డారు.
- 1905 - సిమ్లాలో బాప్తిస్మము పొందారు.
- 1907 - సబాతులో ఉన్న కుష్టు రోగుల హాస్పిటల్ నందు సేవ చేశారు.
- 1908 - టిబెట్ ప్రాంతాన్ని మొట్టమొదటిగా దర్షించారు.
- 1909 - లాహోర్ లోని డివినిటీ కళాశాల నందు సేవకునిగా శిక్షణ పొందారు.
- 1912 - నార్త్ ఇండియా రాష్ట్రాలలో, బుద్ధిజం రాష్ట్రాలలో సేవ జరిగించారు.
- 1918 - 1922 - ప్రపంచ దేశాలను సందర్షించారు.
- 1923 - టిబెట్ కు తిరిగి వచ్చారు.
- 1925 - 1927 - రచనలకు సమయం ఇచ్చాడు.
- 1927 - తిరిగి టిబెట్ ప్రాంతానికి సేవ కొరకు వెళ్లారు. కాని అనారోగ్యం కారణంగా తిరిగి వచ్చేసారు.
- 1929 - చివరి సారి టిబెట్ కు వెళ్లారు.
- 1972 - సాధు సుందర్ సింగ్ ఇవాంజెలికల్ అసోసియేషన్ ఏర్పాటైనది.
మరణం
సాధు సుందర్ సింగ్ గారి మరణం గూర్చి ఇప్పటికి సరైన ఆధారాలు లేవు. సాధు సుందర్ సింగ్ హిమాలయ ప్రాంతాలలోని కొండలలో మరణించాడు అని పరిశోధకులు భావిస్తున్నారు.