Susanna Wesley Biography in telugu
జూన్ 01, 2021
1
సూసన్న వెస్లీ
పిల్లలను దైవ భక్తిలో పెంచిన స్త్రీ మూర్తి, అదేవిధంగా తాను కుటుంబ బాధ్యతను తీసుకొని ఎన్నో శ్రమల వచ్చిన దేవుని పై ఆధారపడిన మిషనరీ అయిన సూసన్న వెస్లీ గారి జీవితం ప్రతి స్త్రీకి ఆదర్శం.
జననం
సూసన్న వెస్లీ గారు 1669 జనవరి 20 వ తేదీన జన్మించింది. ఈమె తలిదండ్రులు శామ్యూల్ అనెస్లే, మేరీ వైట్. ఈమె ఇంగ్లాండ్ లోని లండన్ ప్రాంతానికి చెందినది. ఈమె 25 వ కుమార్తెగా జన్మించారు.
వ్యక్తిగత జీవితం
సూసన్న వెస్లీ గారి జీవితం యావత్తు క్రైస్తవ ప్రపంచానికే ఆదర్శనీయం. ఆమె ఎదుర్కొన్న సమస్యలు చాలా కఠినమైనవి. భర్త విషయములో, సంతాన విషయములో, పిల్లల ఆరోగ్య విషయంలో ఆమె ఎన్నో శ్రమలను, సమస్యలను ఎదుర్కొన్నారు. కాని సూసన్న వెస్లీ గారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఎన్ని సమస్యలు వచ్చిన ఆమె మాత్రం దేవున్ని విడిచిపెట్టలేదు, దేవున్ని విసర్జించలేదు. దేవున్ని ప్రేమించిన స్త్రీ సూసన్న వెస్లీ. గొప్ప ప్రార్ధన వీరురాలు సూసన్న వెస్లీ గారు.
వివాహం
1688 లో సూసన్న వెస్లీ గారికి వివాహం జరిగింది. శ్యాముల్ వెస్లీ అనే వ్యక్తితో వివాహ జీవితంలో ప్రవేశించింది సూసన్న వెస్లీ.
సంతానం
సూసన్న వెస్లీ మరియు శామ్యూల్ వెస్లీ దంపతులను దేవుడు ప్రేమించి మొత్తం 19 మంది సంతాన్నని దేవుడు అనుగ్రహించాడు. వారిలో ముఖ్యమైన వారు జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ. వీరికి జన్మించిన సంతానంలో 9 మంది జబ్బు చేసి ఆనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. మిగిలిన 10 మంది ఎవరనగా...
సూసన్న వెస్లీ గారు తన కుటుంబ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. 19 మంది పిల్లలలో 9 మంది పిల్లలు జబ్బు చేసి మరణించడం జరిగింది. అంతేకాదు ఆమె భర్త ఇంట్లో ఉన్న ఆర్ధిక ఇబ్బందుల వలన కొన్ని చెడు అలవాట్లకు అలవాటు పడిపోయారు. ఆమె భర్తయిన శామ్యూల్ వెస్లీ దొంగతనం చేసి రెండు సార్లు జైలుకు వెళ్లడం జరిగింది. కుటుంబంలో ఉన్న కష్టాల వలన ఇద్దరూ విడిపోవడం జరిగింది. ఆమె ఉంటున్న ఇల్లు కూడా అగ్ని ప్రమాదానికి గురైంది. కానీ మిగిలిన 10 మంది పిల్లలను దైవ భక్తిలో పెంచింది సూసన్న వెస్లీ గారు. ప్రతిరోజు పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధన చేసిన తల్లి సూసన్న వెస్లీ గారు.
పిల్లలను పెంచుటకు 16 కుటుంబ నియమాలు ఇచ్చిన సూసన్న వెస్లీ గారు
- భోజనానికి ముందు ఏమి తినకూడదు.
- రాత్రి 8 గంటలకల్లా పడుకోవాలి.
- వాదించకుండా ఆమె ఇచ్చిన మెడిసిన్స్ వేసుకోవాలి.
- స్వంత చిత్తం చేసుకోకుండా దేవుని మాటకు లోబడాలి.
- లేచిన వెంటనే ప్రార్ధన చేయాలి కాని మాట్లాడకూడదు.
- ఆరాధన జరిగే సమయములో అందరూ ఉండాలి.
- పిల్లలు మంచిగా అడిగితే ఏదైన ఇవ్వాలి కాని ఏడిస్తే ఏది ఇవ్వకూడదు.
- అబద్ధాలు అడకూడదు మరియు వారు ఒప్పుకొని పశ్చాత్తపపడే వరకు వారికి బుద్ధి చెప్పాలి.
- వారు పాపం చేసినప్పుడు వారిని వదిలేయకూడదు.
- ఒక తప్పుకు రెండు సార్లు శిక్షించకూడదు.
- మంచి కార్యాలు చేసిన వారిని అభినందించాలి.
- ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో వారు విఫలం అయితే తిరిగి వారిని ప్రోత్సాహించాలి.
- ఇతరుల వస్తువులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని పాడుచేయకూడదు.
- పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన2ప్రతీ ఆజ్ఞను తప్పక పాటించాలి.
- ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ముందు చదువు పూర్తి చేసాక ఇంటి పని చేయాలి.
- పిల్లలందరూ దేవునికి భయపడాలి.
ప్రత్యేకత
సూసన్న వెస్లీ గారిని మెతడిస్టు సంఘ పితామహురాలు అని అంటారు. (మదర్ ఆఫ్ మెతడిస్ట్) ఈమె ప్రతీ ఆదివారం మధ్యాహ్నం తన పిల్లలతో కలిసి దేవున్ని ఆరాధించే వారు. ఇది చూసిన చుట్టూ ప్రక్కలవారు సుమారు 200 మంది ఈ ఆరాధనకు రావడం మొదలు పెట్టారు.
మరణం
ఎంతో గొప్ప పరిచర్యకు పునాది వేసిన స్త్రీ, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వంటి మెతడిస్ట్ సంఘ సంస్కర్తలను ప్రపంచానికి అందించిన సూసన్న వెస్లీ గారు 1742 వ సంవత్సరం జూలై 23 తేది తన 73వ ఏట మహిమలోకి ప్రవేశించారు.